Authorization
Mon Jan 19, 2015 06:51 pm
యాదాద్రి: మునుగోడు ఉపఎన్నికల్లో విజయం పై మంత్రి సత్యవతి రాథోడ్ స్పందించారు. పార్టీ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించినందుకు రుణపడి ఉంటామని అంటూ మునుగోడు ప్రజలు టీఆర్ఎస్‌పై తమకున్న అభిమానాన్ని మరోసారి చాటారని సంతోషం వ్యక్తం చేశారు. సోమవారం ఉదయం మంత్రి సత్యవతి కుటుంబ సభ్యులతో కలిసి యాదాద్రి శ్రీ లక్ష్మీనారసింహ స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ మంత్రి కేటీఆర్ ఇచ్చిన హామీ మేరకు మూడున్నరేండ్లలో అభివృద్ధికి నోచుకోని మునుగోడు నియోజకవర్గాన్ని అద్భుతంగా తీర్చిదిద్దేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. దొంగ ప్రమాణాలు చేసిన బీజేపీ నాయకులకు లక్ష్మీనరసింహ స్వామి తగిన బుద్ధి చెప్పారని, కేసీఆర్‌తోనే దేశంలో గిరిజనులు, దళితులు, రైతులు, మహిళలు సుభిక్షంగా ఉంటారని అన్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 12 నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ పార్టీని ఆదరించిన ప్రజలందరికీ మంత్రి సత్యవతి ధన్యవాదాలు తెలిపారు.