Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: తాజాగా ఆదివారం జింబాబ్వేతో జరిగిన మ్యాచ్ లో సూర్యకుమార్ యాదవ్ బ్యాటింగ్ మెరుపుల అర్ధ శతకంతో భారత్ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ముఖ్యంగా టీ20 ఫార్మాట్ లో అతనికి ఎదురేలేకుండా పోయింది. వైవిధ్యమైన షాట్లతో గ్రౌండ్ నలుమూలలా షాట్లు కొడుతూ అభిమానులను అలరిస్తున్నాడు. ఇప్పటికే టీ20ల్లో ప్రపంచ నంబర్ బ్యాటర్ గా నిలిచిన సూర్యకుమార్ తాజా ప్రదర్శనతో మరో అరుదైన రికార్డు సొంతం చేసుకున్నాడు. ఈ ఏడాది టీ20 ఫార్మాట్ లో సూర్య వెయ్యి పరుగులు చేశాడు. దాంతో, ఒక క్యాలెండర్ ఇయర్ లో 1000 రన్స్ చేసిన భారత తొలి క్రికెటర్ గా రికార్డుకెక్కాడు. ఓవరాల్ గా ఈ ఘనత పాకిస్థాన్ కు చెందిన మహ్మద్ రిజ్వాన్ మొదటి స్థానంలో ఉండగా రెండో స్థానం సూర్యకుమార్ సాధించుకున్నాడు. ఈ ఏడాది ఇప్పటిదాకా ఆడిన 28 టీ20 ఇన్నింగ్స్ ల్లో సూర్య కుమార్ 44.60 సగటుతో 1026 పరుగులు చేశాడు. 2021లో పాకిస్థాన్ ఓపెనర్ మహ్మద్ రిజ్వాన్ 73.66 సగటుతో 1326 పరుగులు చేయగా సూర్యకుమార్ కేవలం 550 బంతుల్లోనే 1026 పరుగులు చేయడం విశేషం.