Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చెన్నై: ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న దక్షిణాదిలో తొలి వందేభారత్ ట్రైన్ ట్రయల్ రన్ ప్రారంభమైంది. చెన్నై-మైసూర్ వందేభారత్ ట్రయల్ రన్ చెన్నైలోని ఎంజీ రామచంద్రన్ సెంట్రల్ రైల్వే స్టేషన్‌లో సోమవారం ప్రారంభమైంది. ఇది చెన్నై సెంట్రల్ నుంచి బయలుదేరి బెంగళూర్ సిటీ జంక్షన్ మీదుగా తుది గమ్యస్ధానం మైసూర్‌కు చేరుకుంటుంది. దేశీయంగా అభివృద్ధి చేసిన ఈ ఎక్స్‌ప్రెస్ ట్రైన్ దక్షిణాదిన తొలిసారిగా నవంబర్ 11న పట్టాలెక్కనుంది. ఈ ట్రైన్‌లో మొత్తం 16 కోచ్‌లు ఆటోమేటిక్ డోర్స్‌తో పాటు జీపీఎస్ ఆధారిత ఆడియో-విజువల్ ప్యాసింజర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ కలిగి ఉన్నాయి. వినోదం కోసం ఆన్‌బోర్డ్ హాట్‌స్పాట్ వైఫై, కమ్‌ఫర్ట్‌బుల్ సీటింగ్ వంటి సౌకర్యాలను అందుబాటులోకి తీసుకువచ్చారు. ఎగ్జిక్యూటివ్ క్లాస్‌లో కూడా రొటేటింగ్ ఛైర్స్ అమర్చారు. మొత్తం 497 కిలోమీటర్ల దూరాన్ని ఈ ట్రైన్ 6 గంటల 40 నిమిషాల్లో చేరుకుంటుంది.