Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నల్లగొండ: నేడు మునుగోడులోని చండూరు మండలం ఇడికుడ లో కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి ప్రెస్ మీట్ నిర్వహించారు. పాల్వాయి స్రవంతి మాట్లాడుతూ మునుగోడు ఉప ఎన్నికల్లో కోమటిరెడ్డి వెంకటరెడ్డి కొవర్టు రాజకీయాలు చేశారని, ఈ విషయాన్ని అదిష్టానం గుర్తించిందన్నారు. వారిపై చర్యలు ఉంటాయన్న నమ్మకం నాకు ఉందని అన్నారు. రెండు పార్టీలు దన బలంతో, మద్యం పంచి, ప్రలోబాలకు గురిచేసి, బెదిరించి ఎన్నికలు నిర్వహించారని ఆగ్రహించారు. అంతే కాకుండా సిఎం ను కలిసినట్లు ఫొటో మార్ఫింగ్ చేసి నన్ను ఓడించే ప్రయత్నం చేశారన్నారు. బీజేపి కోవర్టు రాజకీయాలు చేస్తున్నారు, ఓటర్లను కల్తీ మద్యం పంచి వారీ ఆరోగ్యంతో చెలగాటం ఆడారని మండిపడ్డారు. ఉప ఎన్నిక ప్రజల కోసం జరగలేదని ఎన్నికల కమిషన్ కూడా తన విధిని సక్రమంగా నిర్వహించలేదని అన్నారు.