Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉదయ్ ఉమేశ్ లలిత్‌కు ఘనంగా వీడ్కోలు పలికారు తోటి జడ్జీలు, న్యాయవాదులు. జస్టిస్ యూయూ లలిత్ మంగళవారం పదవీ విరమణ చేయాల్సి ఉన్నా.. గురునానక్ జయంతి సందర్భంగా కోర్టుకు సెలవు కావడం వల్ల ఇవాళే ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. సుప్రీంకోర్టు 49వ ప్రధాన న్యాయమూర్తిగా ఈ ఏడాది ఆగస్టులో ప్రమాణ స్వీకారం చేసిన జస్టిస్ యూయూ లలిత్.. 74 రోజులపాటు అత్యున్నత పదవిలో కొనసాగారు. సుప్రీంకోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ డీవై చంద్రచూడ్ ఈ నెల 9న బాధ్యతలు స్వీకరించనున్నారు. 2024 నవంబర్ 10 వరకు జస్టిస్ డీవై చంద్రచూడ్ భారత ప్రధాన న్యాయమూర్తిగా కొనసాగనున్నారు.