Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలకు తమ పార్టీ తరపున బరిలో నిలిచే మరో 12 మంది అభ్యర్థుల జాబితాను ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) సోమవారం ప్రకటించింది. ఆప్ ఇప్పటివరకు 141 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. 182 స్థానాలున్న గుజరాత్ అసెంబ్లీకి డిసెంబర్ 1, 5 తేదీల్లో ఓటింగ్ జరగనుండగా.. ఫలితాలు డిసెంబర్ 8న వెలువడనున్నాయి. వరచా రోడ్ నుంచి అల్పేష్ కత్రియా, ఓల్పాడ్ నుంచి ధార్మిక్ మాల్వియాను ఆప్ రంగంలోకి దింపింది. అల్పేష్, ధార్మిక్ మాల్వియా ఇద్దరూ పాటిదార్ ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించారు. ఇటీవలనే వారు ఆమ్ ఆద్మీ పార్టీలో చేరారు. కాగా, గాంధీధామ్ నుంచి బీటీ మహేశ్వరి, దాంతా నుంచి ఎంకే బొంబాడియా, పలన్‌పూర్ నుంచి రమేశ్ నభాని, కాంక్రేజ్ నుంచి ముఖేశ్ ఠక్కర్ రాధన్‌పూర్ నుంచి లాల్జీ ఠాకూర్, మోడాసా నుంచి రాజేంద్ర సింహ్ పార్మర్, రాజ్‌కోట్ (ఈస్ట్) రాహుల్ భువా, రాజ్‌కోట్ (వెస్ట్) నుంచి ధినేష్ జోషి, కుటియానా నుంచి భీమ్‌భాయ్ దనభాయ్ మక్వానా, బోటాడ్ నుంచి ఉమేష్ మక్వానాలకు ఆప్ తమ అభ్యర్థులుగా ప్రకటించింది. గుజరాత్‌లోని మొత్తం 182 స్థానాల్లో పోటీ చేస్తున్నట్లు ఆప్ గుజరాత్ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు గోపాల్ ఇటాలియా తెలిపారు.