Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సర్పంచుల ఫోరం అధ్యక్షుడు భూక్యా మోహన్ రాథోడ్.
నవతెలంగాణ-గోవిందరావుపేట
మండలంలోని ప్రతి తండాలో ఒక గ్రంథాలయాన్ని ఏర్పాటు చేసి గిరిజనులకు పుస్తక పఠనానికి విజ్ఞాన అభివృద్ధికి తోడ్పడాలని మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు బుక్యా మోహన్ రాథోడ్ అన్నారు. సోమవారం నూతన గ్రంథాలయ చైర్మన్ పోరిక గోవింద్ నాయక్ ను పలువురు నాయకులతో కలిసి శుభాకాంక్షలు తెలిపి సన్మానించారు. ఈ సందర్భంగా మోహన్ రాథోడ్ మాట్లాడుతూ ములుగు నియోజకవర్గ రాజకీయాల్లో సుదీర్ఘకాలం ఎన్నో ఆటుపోటులను ఎదుర్కొని ధైర్యంగా నిలబడ్డ గోవింద నాయక్ ఈనాడు గ్రంధాలయ చైర్మన్ గా నియమించడం ప్రజలందరూ హర్షించదగ్గ విషయమని అన్నారు. పదవికి వన్నెతెస్తూ జిల్లాలో గ్రంథాలయాల అభివృద్ధికి కృషి చేయాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆజ్మీర బిక్కు నాయక్ గోవిందరావుపేట ఎస్టి సెల్ సభ్యులు, ప్రధాన కార్యదర్శి లకావత్ నరసింహ నాయక్ సీనియర్ నాయకులు మురళి, గోపి, సూరనేని మురళీధర్ రావు జిల్లా నాయకులు, నవీన్, తదితరులు పాల్గొన్నారు.