Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆర్టీసీ చైర్మన్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్
నవతెలంగాణ- డిచ్ పల్లి
గ్రామంలో పలు కుల సంఘాల నిర్మాణాలకు నీదులు మంజూరు చేస్తానని ఆర్టీసీ చైర్మన్ నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. సోమవారం ఇందల్ వాయి మండలంలోని గన్నరం గ్రామంలోని
పద్మశాలి సంఘం, యాదవ సంఘం, బెస్త సంఘల సభ్యులు కమ్యూనిటీ హల్ల నిర్మాణాల కోసం నీధులు కేటాయించాలని కోరుతూ వినతిపత్రలను అందజేశారు. అనంతరం సానుకూలంగా స్పందించి ఈ వచ్చే బడ్జెట్లో నిధులు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు చిలివెరి గంగాదాస్, డైరెక్టర్ రాంరెడ్డి, నాయకులు, రవి, రాజ్ కుమార్, రాకేష్ గౌడ్, ఉరడీ గోవర్ధన్, నక్క గంగారెడ్డి, జక్కుల నగేశ్, పెల్లే రాజు, వేముల ప్రవీణ్, దుబ్బాక చిన్న సాయిలు, పంపు సాయిలు తోపాటు తదితరులు పాల్గొన్నారు.