Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-గోవిందరావుపేట
మండలంలోని పసర గ్రామానికి చెందిన యాకుబ్ పాషా [35] గత వారం రోజుల క్రితం తాడువాయి 163 వ జాతీయ రహదారిలో రోడ్డు ప్రమాదంలో మరణించడం జరిగింది. సోమవారం జడ్పిటిసి తుమ్మల హరిబాబు యాకుబ్ పాషా చిత్రపటానికి పూలమాలవేసి నివాళీలు అర్పించి, కుటుంబ సభ్యులకు 3000 రూపాయలు ఆర్థిక సహాయంతో పాటు ఒక క్వింటా బియ్యం ఇవ్వడం జరిగింది. కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతిని తెలిపి పాష కుటుంబానికి టిఆర్ఎస్ పార్టీ ఎల్లవేళలా అండగా ఉండి ఆదుకుంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ పసర గ్రామ అధ్యక్షుడు తాటికొండ శ్రీనివాస్, చారి కోఆప్షన్ సభ్యులు మహమ్మద్ బాబర్, సుడి సతీష్ రెడ్డి, కీర్తి రవి, మువ్వ భాను, కొండి రమేష్, మునిగాల వెంకన్న, చుంచు యాకోబ్, గడ్డం సారయ్య, పసుల సమ్మయ్య, పసల భద్రయ్య, ఊటుకూరు వెంకటరమణయ్య, తదితరులు పాల్గొన్నారు.
సండ్రగూడెంలో బాలాజీ నగర్ పంచాయతీ పరిధిలోగల సాండ్ర గూడెం గ్రామంలో టిఆర్ఎస్ పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షులు మాలోతు గాంధీ తల్లి మృతి కర్మ మూడవ రోజున జడ్పిటిసి తుమ్మల హరిబాబు సందర్శించి గాంధీ కుటుంబాన్ని పరామర్శించి తల్లి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. అనంతరం గాంధీ కుటుంబానికి మూడు వేల రూపాయలను ఆర్థిక సహాయంగా అందించి గాంధీ కుటుంబానికి టిఆర్ఎస్ పార్టీ ఎల్లవేళలా అండగా ఉండి ఆదుకుంటుందన్నారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ సీనియర్ నాయకులు మల్లేష్ గౌడ్, సర్పంచ్ ఇస్లావత్ మౌనిక వినోద్ నాయక్, తుమ్మల శివ భూక్య మీటు కోరిక స్వామి, మాజీ ఎంపిటిసి లకవత్ చందులాల్, అజ్మీర నరసింహ, జరుపుల ప్రతాప్, భూక్య స్వామి తదితరులు పాల్గొన్నారు.