Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : రామంతపూర్ శ్రీ చైతన్య పాఠశాలలో సోమవారం మాక్సి విజన్ ఐ, డెంటల్ ఆస్పత్రి సంయుక్తంగా ఉచిత ఆరోగ్య శిబిరం నిర్వహించింది. కార్యక్రమములో ఎజియమ్ సతీష్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి విద్యార్థి ఆరోగ్యంగా మానసికంగా దృడంగా ఉంటే అనుకున్న ఫలితాలు సాధించగలుగుతమని ఆరోగ్యం విషయలో పెద్దల సలహాలను పాటిస్తూ జాగ్రత్తగా ఉండాలని సూచించారు. మాక్సి విజన్ ఐ , డెంటల్ డాక్టర్ విద్యార్థులందరికి కంటి, పంటి పరీక్షలు చేసి తగిన సూచనలు సలహాలు ఇచ్చారు. పాఠశాల ప్రిన్సిపాల్ భాగ్యలక్ష్మి మాట్లాడుతూ కంటి, పంటి డాక్టర్లకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జోన్ ఎగ్జిక్యూటీవ్ సనమ్ జీ, కోఆర్డినేటర్ రాజేంద్ర ప్రసాద్, పాఠశాల వైస్ ప్రిన్సిపాల్ శ్రీ కీర్తి కోన, డీన్ నాగారజు, ఉపాద్యాయులు విద్యార్థలు పాల్గొన్నారు.