Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : గవర్నర్ తమిళిసై ఇవాళ కేంద్ర హోం మంత్రి అమిత్ షాను ఢిల్లీలో కలిశారు. గవర్నర్ గా మూడు సంవత్సరాల పదవీ కాలాన్ని పూర్తి చేసుకొని, నాలుగో సంవత్సరంలోకి ప్రవేశించిన సందర్భంగా అమిత్ షాను కలిశానని ఆమె తెలిపారు. ఇది సాధారణ మీటింగ్ మాత్రమేనని గవర్నర్ స్పష్టం చేశారు. గత మూడేళ్లకు సంబంధించిన రిపోర్టును కేంద్రానికి ఇచ్చానని తెలిపారు. అయితే ఈ భేటీలో తెలంగాణలోని పరిస్థితులు, రాష్ట్ర ప్రభుత్వ వ్యవహార శైలి, మునుగోడు బై పోల్ పరిణామాలు, మొయినాబాద్ ఫాంహౌజ్ వ్యవహారంపైనా చర్చ జరిగి ఉండొచ్చనే అంచనాలు వెలువడుతున్నాయి. మునుగోడు బై పోల్ ఫలితాలు వచ్చిన మరుసటి రోజే గవర్నర్ తమిళిసై ఢిల్లీకి వెళ్లి అమిత్ షా తో భేటీ కావడంపై రాజకీయ వర్గాల్లో విస్తృత చర్చ జరుగుతోంది.