Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-భిక్కనూర్
మండల కేంద్రంలో సోమవారం గౌడ సంఘం ఏర్పాటు చేసిన సమావేశంలో టి టి సి ఎస్ ఎన్నికలు నిర్వహించారు. ఏన్నికల అధికారి కర్ణకర్ రెడ్డి, ఎక్సైజ్ సీఐ పోతిరెడ్డి సమక్షంలో గౌడ సంఘం ఆధ్వర్యంలో గీతా పారిశ్రామిక సహకార సంఘం నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. గౌడ సంఘం అధ్యక్షుడిగా లింగాల సిద్ధ గౌడ్, డైరెక్టర్లు ఉపాధ్యక్షుడు షేర్ల రాజు గౌడ్, లింగాల స్వామి గౌడ్, లింగాల ఎల్ల గౌడ్, జేపీ చిన్న రామ గౌడ్ లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు లింగాల సిద్ధ గౌడ్ మాట్లాడుతూ తనను ఎన్నుకున్నందుకు కృతజ్ఞతలు తెలుపుతు సంఘం అభివృద్ధికి కృషి చేస్తా ఉన్నారు. ఈ కార్యక్రమంలో గౌడ సంఘ సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.