Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-భిక్కనూర్
రాష్ట్ర ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ మాతృమూర్తి గంప రాజమ్మ గత ఐదు రోజుల క్రితం అనారోగ్యంతో మృతి చెందిన విషయం తెలుసుకున్న టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, పురపాలక మరియు ఐటీ శాఖ మంత్రి కల్వకుంట తారక రామారావు, మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, రాష్ట్ర విప్ గొంగిడి సునీత, ఎమ్మెల్సీ వీజీ గౌడ్, డిసిసిబి చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి లు సోమవారం ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా గంప రాజమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఆమె పవిత్రమైన ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు. ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ కు మాతృవియోగం కావడం బాధాకరమని, భగవంతుడు గుండె నిబ్బరం ఇవ్వాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు ముజిబొద్దిన్, టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు నరసింహారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ భగవంతు రెడ్డి నియోజకవర్గంలోని ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా డి.ఎస్.పి సోమనాథం, సర్కిల్ ఇన్స్పెక్టర్ తిరుపయ్య ఆధ్వర్యంలో భారీ బందోబస్తు నిర్వహించారు.