Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: ఈ నెల 8న నిర్వహించాల్సిన పున్నమి గరుడ సేవను తిరుమల తిరుపతి దేవస్థానం రద్దు చేసింది. మంగళవారం చంద్రగ్రహణం కారణంగా సేవను రద్దు చేస్తున్నట్లు దేవస్థానం తెలిపింది. గ్రహణం నేపథ్యంలో మంగళవారం ఉదయం 8 గంటల నుంచి రాత్రి 7.30 గంటల వరకు శ్రీవారి ఆలయ తలుపులు మూసి వేయనున్నారు. ఈ కారణంగా అన్ని రకాల దర్శనాలు, ఆర్జితసేవలు, గరుడ సేవను టీటీడీ రద్దు చేసింది. శుద్ధి, కైంకర్యాల అనంతరం రాత్రి 7.30 గంటల తర్వాత సర్వదర్శనం భక్తులను వైకుంఠం క్యూకాంప్లెక్స్-2 ద్వారా భక్తులను దర్శనానికి అనుమతించనున్నట్లు వివరించింది.