Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ సూర్యకుమార్ యాదవ్ ను ప్రశంసించారు. టీంఇండియాలో సూర్యకుమార్ ఆటలో ప్రత్యేక స్టెల్ క్రీయట్ చేసుకున్నవాడు. మైదానంలో ఏ మూలకైనా షాట్లు కొట్టగలిగే టెక్నిక్ అతడి సొంతం. ప్రస్తుతం ఆస్ట్రేలియాలో జరగుతున్న టీ20 వరల్డ్ కప్ లోనూ సూర్యకుమార్ యాదవ్ జోరు తెలిసిందే. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ క్రికెట్లో సూర్యకుమార్ యాదవ్ నూతన మిస్టర్ 360 అని కితాబిచ్చాడు. అతడు జట్టులో లేకపోయినా, అతడు విఫలమైనా టీమిండియా 140-150 పరుగులు చేయడానికి కూడా ఇబ్బందిపడుతుందని అభిప్రాయపడ్డారు. ఈ వరల్డ్ కప్ లో అతడు ఆడిన ప్రతి ఇన్నింగ్స్ దాదాపు 360 డిగ్రీల కోణంలో సాగిందేనని గవాస్కర్ అన్నారు. వికెట్ కీపర్ పక్క నుంచి సిక్స్ కొట్టడం సూర్యకుమార్ యాదవ్ కే చెల్లిందని కొనియాడారు. ఫైనల్ ఓవర్లలో బౌలర్లను లక్ష్యంగా చేసుకుని స్క్వేర్ లెగ్ వైపు బంతిని స్టాండ్స్ లోకి పంపడం అతడి ప్రతిభకు నిదర్శనం అని ప్రశంసించారు. సూర్యకుమార్ యాదవ్ కొట్టలేని షాట్ అంటూ ఏదీ లేదని, సూర్యకుమార్ కారణంగానే టీమిండియా భారీ స్కోర్లు సాధిస్తోందని అన్నారు.