Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం సోమవారం మరో నామినేటెడ్ పదవిని భర్తీ చేసింది. తెలంగాణ రాష్ట్ర డెయిరీ డెవలప్ మెంట్ కో ఆపరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్ చైర్మన్ గా సోమా భరత్ కుమార్ ను నియమించింది. ఈ మేరకు సోమవారం ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ చేతుల మీదుగా సోమా భరత్ కుమార్ నియామక ఉత్తర్వులను అందుకున్నారు. ఈ పదవిలో భరత్ కుమార్ రెండేళ్ల పాటు కొనసాగనున్నారు. తనపై నమ్మకం ఉంచి ఈ పదవిలో నియమించిన కేసీఆర్ కు ఆయన ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్రంలో డెయిరీ రంగం అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానని ఆయన తెలిపారు.