Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: దేశంలో మెట్రోపాలిటన్ నగరాల కంటే గ్రేటర్ హైదరాబాద్ శరవేగంగా అభివృద్ధి చెందుతున్న విషయం తెలిసిందే. ఐటీ కారిడార్‌లో ట్రాఫిక్ చిక్కులు తప్పించే రవాణాయే లక్ష్యంగా గచ్చిబౌలి ఫ్లైఓవర్ పైన శిల్పా లేఅవుట్‌లో నిర్మించిన వంతెనను ఈ నెల 20న ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించనున్నారు. ఈ మేరకు జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలో వంతెనకు తుది మెరుగులు దిద్దుతున్నారు. ఈ వంతెన అందుబాటులోకి వస్తే ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, హైటెక్ సిటీ మధ్య రోడ్ కనెక్టివిటీ పెరుగుతుంది. ఇదే సమయంలో గచ్చిబౌలి జంక్షన్ ట్రాఫిక్ సమస్యలకు ఉపశమనం కలుగుతుంది. ప్రధానంగా రవాణా సౌకర్యం, వాహన కాలుష్యాన్ని తగ్గించడం, సిగ్నల్ ఫ్రీ రవాణా వ్యవస్థను మెరుగు పరచడంపై దృష్టి సారించింది. ఆ తరుణంలో 17 ఫ్లైఓవర్ ప్రారంభానికి ముస్తాబు అవుతోంది. ఓఆర్‌ఆర్ నుంచి గతంలో ఉన్న గచ్చిబౌలి ఫ్లై ఓవర్ పై నుంచి శిల్పా లే అవుట్ వరకు ఓఆర్‌ఆర్ వరకు రెండు వైపులా కలుపుకుని మొత్తం 956 మీటర్ల పొడవు, 16.60 మీటర్ల వెడల్పు గల ఫ్లై ఓవర్ చేపట్టారు. అప్ ర్యాంపు ఓఆర్‌ఆర్ నుంచి శిల్పా లే అవుట్ ఫ్లై ఓవర్ వరకు 456.64 మీటర్ల వెడల్పు, శిల్పా లే అవుట్ నుంచి ఓఆర్‌ఆర్ వరకు డౌన్ ర్యాంపు ఫ్లై ఓవర్ 399.952 మీటర్ల వెడల్పుతో రెండు ఫ్లై ఓవర్‌లను చేపట్టారు. సర్వీస్ రోడ్డుగా ఉపయోగించబడే గచ్చిబౌలి నుంచి మైండ్ స్పేస్ వరకు 473 మీటర్ల పొడవు, 8.50 మీటర్ల వెడల్పుతో అప్ ర్యాంపు ఫ్లై ఓవర్‌ను చేపట్టారు. అదే విధంగా మైండ్ స్పేస్ నుంచి గచ్చిబౌలి వరకు డౌన్ ర్యాంపు ఫ్లై ఓవర్ 522 మీటర్ల పొడవు, 8.50 మీటర్ల వెడల్పుతో చేపట్టారు. శిల్పా లే అవుట్ ఫ్లై ఓవర్ వల్ల ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, హైటెక్‌సిటి మధ్య రోడ్ కనెక్టివిటీ పెరుగుతుంది. గచ్చిబౌలి జంక్షన్ ట్రాఫిక్ సమస్యలకు ఉపశమనం కలుగుతుంది.