Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: న్యాయవాదిగా, న్యాయమూర్తిగా తన 37 ఏండ్ల ప్రయాణం చాలా సంతృప్తినిచ్చిందని సీజేఐ జస్టిస్ లలిత్ తెలిపారు. మంగళవారం ఆయన పదవీ విరమణ చేయనున్నారు. ఈ సందర్భంగా సోమవారం నిర్వహించిన వీడ్కోలు సమావేశంలో ఆయన మాట్లాడుతూ సుప్రీంకోర్టులో లాయర్‌గా తన తొలి కేసును జస్టిస్ వైవీ చంద్రచూడ్ బెంచ్ ముందు వాదించానన్నారు. ఇప్పుడు ఆయన కుమారుడు జస్టిస్ డీవై చంద్రచూడ్‌కు సీజేఐగా బాధ్యతలు అప్పగించడం ఆనందంగా ఉందన్నారు. ఈ ఏడాది ఆగస్టు 27న 49వ సీజేఐగా బాధ్యతలు స్వీకరించిన జస్టిస్ లలిత్ 74 రోజుల పాటు ఆ పదవిలో కొనసాగడం విశేషం. తాజాగా 103వ రాజ్యాంగ సవరణపై మెజార్టీ తీర్పును వ్యతిరేకిస్తూ జస్టిస్ యూయూ లలిత్ మైనార్టీ తీర్పు వెలువరించారు. ఇది ఆయన ఇచ్చిన చివరి తీర్పుల్లో ఒకటి కావడం విశేషం. తదుపరి సీజేఐగా జస్టిస్ డీవై చంద్రచూడ్ ఈ నెల 9న ప్రమాణం చేయనున్నారు.