Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: బీఏసీ సభ్యుడిగా టీఆర్‌ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కే కేశవరావు మరోసారి నియమితులయ్యారు. ఈ తరుణంలో రాజ్యసభ సెక్రటేరియట్ సోమవారం బులెటిన్‌ను విడుదల చేసింది. బిజినెస్ అడ్వయిజరీ కమిటీలో పది మందిని సభ్యులుగా నియమించారు. ఈ కమిటీకి రాజ్యసభ చైర్మన్ అధ్యక్షుడిగా ఉంటారు. కాగా, రాజ్యసభలో వివిధ కమిటీలను చైర్మన్ పునర్‌వ్యవస్థీకరించారు.
ప్రకాశ్ జవదేవకర్ చైర్మన్‌గా ఉన్న ఎథిక్స్ కమిటీలో కూడా కే కేశవరావును సభ్యుడిగా నియమించారు. రూల్స్ కమిటీలో టీఆర్‌ఎస్ రాజ్యసభ సభ్యుడు బీ పార్థసారథి రెడ్డిని, సబార్డినేట్ లెజిస్లేషన్ కమిటీలో కేఆర్ సురేశ్ రెడ్డిని, డాక్టర్ సీఎం రమేశ్ చైర్మన్‌గా ఉన్న హౌజ్ కమిటీలో సభ్యులుగా బడుగుల లింగయ్య యాదవ్‌ను, ఏపీ నుంచి వేంరెడ్డి ప్రభాకర్‌రెడ్డిని నియమిస్తూ రాజ్యసభ చైర్మన్ ఆదేశాలు జారీ చేశారు. వైసీపీ పార్లమెంటరీ పక్ష నేత విజయసాయిరెడ్డికి కూడా కమిటీల్లో అవకాశం లభించించింది.