Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: టీఎస్‌ఎంఎస్‌ఐడీసీ, ఎన్‌హెచ్‌ఎం పరిధిలో జరుగుతున్న అభివృద్ధి పనుల పురోగతిపై మంత్రి హరీశ్‌రావు సోమవారం నెలవారీ సమీక్ష నిర్వహించారు. గర్భిణుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న 56 అత్యాధునిక టిఫా్ణ స్కానింగ్ యంత్రాలను ఈ నెల 18న ప్రారంభించనున్నట్టు వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు తెలియజేశారు. తల్లీబిడ్డల సంరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతున్నదని, అందులో భాగంగా ప్రభుత్వ దవాఖానల్లో టిఫా యంత్రాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. వీటితోపాటు కంటి చికిత్సలకు ఉపయోగించే 26 ఆపరేటివ్ మైక్రోస్కోప్‌లను కూడా ప్రారంభించనున్నట్టు తెలిపారు. వీటన్నింటినీ ఆన్‌లైన్ ద్వారా ఒకేసారి ప్రారంభించేలా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. దీంతో ఇకపై గర్భిణులు పరీక్షల కోసం ప్రైవేట్ ల్యాబ్‌లకు వెళ్లాల్సిన అవసరమే ఉండదని, అన్ని రకాల స్కానింగ్‌లను ప్రభుత్వ దవాఖానల్లో, థైరాయిడ్ లాంటి పరీక్షలను టీ-డయాగ్నస్టిక్స్ ద్వారా ఉచితంగా నిర్వహించనున్నట్టు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టీఎస్‌ఎంఎస్‌ఐడీసీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, ఎండీ చంద్రశేఖర్‌రెడ్డి, డీపీహెచ్ శ్రీనివాస్‌రావు, డీఎంఈ రమేశ్‌రెడ్డి, టీవీవీపీ కమిషనర్ అజయ్ కుమార్, కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్ శ్వేతా మహంతి, సీఎం ఓఎస్డీ గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.