Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఐరోపా: ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేధిక ప్రకారం ఐరోపాలో వేడి విపరీతంగా పెరిగిపోతున్న ఫలితంగా ఈ సంవత్సరంలో 15వేల మంది ప్రాణాలు కోల్పోయారని తెలుస్తుంది. స్పెయిన్, పోర్చుగల్‌లో సుమారు 4వేల మంది, యూకేలో వెయ్యికిపైగా, బ్రిటన్‌లో 3,200, జర్మనీలో 4,500 మందికిపై మరణాలు నమోదయ్యాయని యూరప్ ప్రాంతీయ డైరెక్టర్ డాక్టర్ హన్స్ హెన్రీ క్లూగే అన్నారు. పలు దేశాల్లో మరణాల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందన్నారు. ఫ్రాన్స్ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ఎకనామిక్స్ స్టడీస్ 2019లో జూన్ 1, 2022 ఆగస్టు మధ్య కాలంలో పోలిస్తే 11వేలు ఉన్నట్లు పేర్కొంది. జూన్ మధ్య హీట్‌వేవ్ కారణంగా మొదలైనట్లు ఐఎన్‌ఎస్‌ఈఈ గణాంకాలు చెపుతున్నాయి. సాధారణంగా హీట్‌వేవ్స్ జూలైలో సంభవిస్తుంటాయి. ఐరోపాలో ఉష్ణోగ్రతలు 1961-2021 మధ్య కాలంలో గణనీయంగా పెరుగుతున్నాయి. సగటున దశాబ్దానికి 0.5 డిగ్రీల చొప్పున వేడి పెరుగుతున్నది. ప్రపంచ వాతావరణ సంస్థ ఈ వారం విడుదల చేసిన నివేదిక ప్రకారం అత్యంత వేగంగా వేడెక్కుతున్న ప్రాంతం ఐరోపానే. ఈ ప్రాంతంలో గత 50 ఏళ్లుగా విపరీతమైన ఉష్ణోగ్రతల కారణంగా 1.48లక్షల మంది మరణించారని ప్రపంచ ఆరోగ్య సంస్థ యూరప్ ప్రాంతీయ డైరెక్టర్ హన్స్ హెన్రీ పేర్కొన్నారు.