Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అమరావతి: ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కింద మూడు నెలల పాటు ఉచిత బియ్యాన్ని పంపిణీ చేస్తున్నట్లు ఏపీ ప్రభుత్వం తెలిపింది. ప్రతినెల 19 నుంచి 28 లోగా బియ్యాన్ని జాతీయ ఆహార భద్రత కార్డుదారులు రేషన్ దుకాణాల దగ్గర తీసుకోవాలని తెలిపారు. కొంత నాన్ సార్టెక్స్, మరికొంత నాన్ సార్టెక్స్ ఫోర్టిఫైడ్ బియ్యం నిల్వ ఉంన్నాయి. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, మన్యం డాక్టర్ అంబేద్కర్ కోనసీమ, ఎన్టీఆర్, బాపట్ల, నెల్లూరు జిల్లాలకు నాన్ సార్టెక్స్ మిగిలిన 16 జిల్లాలకు నాన్ సార్టెక్స్ ఫోర్టి పైడ్ బియ్యాన్ని సరాపరా చేస్తున్నారు. వచ్చే ఏప్రిల్ నాటికి అన్ని జిల్లాలకు విస్తరించనున్నారు.