Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అమరావతి: ఏపీ సర్కార్ కు కేంద్రం బిగ్ రిలీఫ్ అదించింది. ఆంధ్రప్రదేశ్ కు రెవెన్యూ లోటు కింద కేంద్ర ప్రభుత్వం రూ. 879 కోట్లను విడుదల చేసింది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు ఏపీకి రెవెన్యూ లోటు గ్రాంట్ రూపంలో రూ.7032.67 కోట్లు విడుదల చేశామని కేంద్రం తెలియజేసింది. 15వ ఆర్థిక సంఘం సిఫారసుల మేరకు 8వ వాయిదా కింద ఏపీతో సహా లోటును ఎదుర్కొంటున్న 14 రాష్ట్రాలకు కలిపి రూ.7183.42 కోట్లను విడుదల చేశామని కేంద్రం పేర్కొంది. ఈ రూ.7183.42 కోట్లతో ఏపీ, అస్సాం, హిమాచల్ ప్రదేశ్, కేరళ, మణిపూర్, మేఘాలయ, మిజోరం, నాగాలాండ్, పంజాబ్, రాజస్థాన్, సిక్కిం, త్రిపుర, ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్ లకు విడుదల చేసినట్లు తెలుసుంది.