Authorization
Mon Jan 19, 2015 06:51 pm
డీల్లి: జ్ఞానవాపీ మసీదు ప్రాంగణంలోని కొలనులో గుర్తించిన శివలింగానికి పూజలు చేయడానికి అనుమతించాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై వారణాసి ఫాస్ట్‌ట్రాక్ కోర్టు మంగళవారం కీలక తీర్పు ఇవ్వనుంది. ఈ కేసులో హిందూ పక్షాలు లేవనెత్తిన మూడు డిమాండ్లపై సివిల్ జడ్జ్ సీనియర్ డివిజన్ ఫాస్ట్ ట్రాక్ కోర్టు తీర్పు వెల్లడించనుంది. తక్షణమే స్వయంభూ జ్యోతిర్లింగ భగవాన్ విశ్వేశ్వర్‌కు పూజలు చేసుకునేందుకు అనుమతి, జ్ఞానవాపీ మసీదు కాంప్లెక్స్‌ను హిందువులకు అప్పగించడం, మసీదులోకి ముస్లింలను ప్రవేశించకుండా నిషేధించడం వంటి మూడు డిమాండ్లపై నిర్ణయం తీసుకోనుంది ఫాస్ట్‌ట్రాక్ కోర్టు.మిగతా విసయాలు తెలవాల్సి ఉంది.