Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: సైబర్ నేరగాళ్ళ వలలు రోజుకో తరహా కొత్త నేర విధానాన్ని తెరమీదకు తెస్తూ అమాయకులతో ఆడుకుంటున్నారు. తాజాగా ఇంటర్నెట్ బ్యాంకింగ్ అప్‌డేట్ అంటూ కొత్త మోసాలకు తెరతీశారు. ఆన్‌లైన్ బ్యాంక్ లావాదేవీలు, ఇంటర్నెట్ బ్యాంకింగ్ వాడకం పెరుగడంతో ఈ రూటు వైపుమళ్ళారు. మీ ఇంటర్నెట్ బ్యాంకింగ్ పాస్‌వర్డ్, యూజర్‌నేమ్ అప్‌డేట్ చేసుకోవాలని, లేదంటే మీ బ్యాంక్ ఖాతాకు లింకు ఉన్న పాన్‌కార్డు అప్‌డేట్ చేసుకోవాలని బ్యాంకు అధికారుల మాదిరిగా ఎస్‌ఎంఎస్‌లు పంపుతున్నారు. ఈ మెసేజ్‌లలో ఉన్న లింక్‌పై క్లిక్ చేస్తే మీ పాన్‌కార్డు నంబర్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ వివరాలు అప్‌డేట్ అవుతాయని అందులో పేర్కొంటున్నారు.దీనిపై మరింత జాగ్రత్త అవసరం ఉంది.