Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : ప్రధాన మంత్రి నరేంద్రమోడీ తెలంగాణ పర్యటనను అడ్డుకోవాలని పార్టీ శ్రేణులకు సీపీఐ పిలుపునిచ్చింది. మోడీ గో బ్యాక్ అంటూ నిరసనలు తెలుపుతామని ఆ పార్టీ నేత చాడ వెంకట్‌రెడ్డి అన్నారు. తెలంగాణకు ఇచ్చిన హామీలను మోడీ నెరవేర్చలేదని విమర్శించారు. రామగుండంలో సింగరేణి కాలరీస్‌ను ప్రైయివేట్‌పరం చేయాలని కుట్రలు చేస్తున్నారన్నారు. రాజకీయ స్వార్థం కోసమే మోడీ రామగుండం పర్యటన అని చాడ వెంకట్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.