Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : తెలంగాణలో బీజేపీ కుట్రలు చెల్లవని.. మునుగోడు ప్రజలు బీజేపీకి చెప్పుతో సమాధానం చెప్పారని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. జనగామలో మంగళవారం జిల్లా పార్టీ అధ్యక్షులు పాగాల సంపత్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో మంత్రితో పాటు స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య, ఎమ్మెల్యే ముత్తిరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రజలకు అవసరం లేని ఉప ఎన్నిక తెచ్చిన బీజేపీ 18 వేల కోట్ల కాంట్రాక్ట్ ఇచ్చి రాజగోపాల్ రెడ్డిని కొనుగోలు చేసి ఈ ఎన్నికల్లో బలిపశువును చేశారన్నారు. ఎన్నికల్లో మతోన్మాదాన్ని రెచ్చగొడుతూ రాజకీయాలు చేయడం తప్ప రాష్ట్రానికి ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో బీజేపీ విఫలమైందన్నారు.