Authorization
Mon Jan 19, 2015 06:51 pm
జమ్మూ కశ్మీర్: జమ్మూ కాశ్మీర్‌లోని దోడాలోని ప్రేమ్‌నగర్ ప్రాంతంలో మంగళవారం రాత్రి వేగంగా వస్తున్న ఓ కారు చీనాబ్ నదిలో పడిపోవడంతో నలుగురు వ్యక్తులు మరణించారు. కారు చీనాబ్ నదిలో పడిపోవడంతో మృతుల జాడ కోసం గాలిస్తున్నామని కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ చెప్పారు. చీనాబ్ నదిలో పడిన కారులోని నలుగురు వ్యక్తులు మరణించారని మెజిస్ట్రేట్ అథర్ అమీన్ జర్గర్ చెప్పారు. నలుగురు వ్యక్తులతో వెళుతున్న ఒక ప్రైవేట్ కారు ప్రమాదవశాత్తు థాత్రి, ప్రేమ్ నగర్ మధ్య షిబ్నోట్ వద్ద చీనాబ్ నదిలో పడిపోయిందని, మృతదేహాలను వెలికితీసేందుకు ప్రయత్నాలు చేస్తన్నామని జమ్మూకశ్మీర్ దోడా డిప్యూటీ కమిషనర్ విశేష్ పాల్ మహాజన్ చెప్పారు.