Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నేపాల్: నేపాల్ దేశంలో బుధవారం తెల్లవారుజామున సంభవించిన భూకంపం వల్ల దోటి జిల్లాలో ఇల్లు కూలి ఆరుగురు మరణించారు. నేపాల్‌లోని దోటి జిల్లాలో ఇల్లు కూలిపోవడంతో ఆరుగురు వ్యక్తులు మరణించినట్లు నేపాల్ అధికారులు చెప్పారు.ఢిల్లీ,ఎన్‌సీఆర్ ప్రాంతంలో తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో ప్రజలు భూప్రకంపనలతో నిద్ర లేచారు. నేపాల్‌లో గత 24 గంటల్లో మూడు సార్లు ప్రకంపనలు సంభవించాయని నేపాల్ జాతీయ భూకంప కేంద్రం ధృవీకరించింది.‘‘నేపాల్ దేశంలో బుధవారం తెల్లవారుజామున 2.12 గంటలకు 6.6 తీవ్రతతో మూడవ బలమైన భూకంపం సంభవించింది. దీని ఫలితంగా ఒక ఇల్లు కూలిపోవడంతో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. మరణాలు గైరాగాన్ ప్రాంతంలో వెలుగుచూశాయి’’అని దోటి జిల్లాకు చెందిన పూర్బిచౌకి గ్రామ కౌన్సిల్ చైర్మన్ రామ్ ప్రసాద్ ఉపాధ్యాయ్ చెప్పారు.నేపాల్‌లో రాత్రి 8.52 గంటల ప్రాంతంలో 4.9 తీవ్రతతో మొదటి భూకంపం వచ్చింది. తెల్లవారుజామున 1.57 గంటలకు 6.3 తీవ్రతతో రెండవ భూకంపం సంభవించింది.