Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: నేపాల్‌లో గత అర్ధరాత్రి దాటిన తర్వాత భారీ భూకంపం సంభవించింది. దీని ప్రభావంతో దేశ రాజధాని ఢిల్లీలోనూ భూ ప్రకంపనలు కనిపించాయి. ఘజియాబాద్, నోయిడా, గురుగ్రామ్, లక్నోలో కూడా సంభవించాయి. ఉత్తరాఖండ్‌లోని పితోర్‌గఢ్‌కు తూర్పు-ఆగ్నేయంగా 90 కిలోమీటర్ల దూరంలో రెండో భూకంప కేంద్రం ఉంది. సోషల్ మీడియాలో నెటిజన్లు ట్విట్టర్‌లో తమ ప్రకంపనల అనుభవాన్ని పంచుకున్నారు. ఢిల్లీ-ఎన్‌సిఆర్ ప్రాంతం ప్రకంపనలకు గురైందని ఓ నెటిజన్ చెప్పారు.భూప్రకంపనలతో సీలింగ్ ఫ్యాన్ వణుకుతున్న ఫొటోలను హైరైజ్ నివాసితులు పోస్ట్ చేశారు. ‘‘ట్వీట్ చేయదలచుకోలేదు కానీ, భూకంపంలా అనిపించిందని ఎవరైనా చెప్పగలరు!’’అని కేంద్ర మంత్రి మీనాక్షి లేఖి ట్వీట్ చేశారు.