Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తూర్పుగోదావరి: రాజమండ్రి రైల్వేస్టేషన్ వద్ద గూడ్స్ రైలు(Goods train) పట్టాలు తప్పింది. రాజమండ్రి ఐఎల్టీడీ ప్లైఓవర్ వద్ద తెల్లవారుజామున ఈ ఘటన చోటు చేసుకుంది. గూడ్స్ రైలు పట్టాలు తప్పడంతో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. విశాఖ నుంచి విజయవాడ వెళ్తున్న గూడ్స్ రైలు పట్టాలు తప్పడంతో పలు రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. ఈ ప్రమాదంపై సమాచారం తెలుసుకున్న రైల్వే అధికారులు ఘటన స్థలానికి చేరుకుని భోగిని పట్టాలపై నుంచి తొలగించేందుకు చర్యలు చేపట్టారు.