Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కేఏ పాల్ ఈ వ్యాఖ్యలు చేయడం ప్రస్తుతం ఏపీ రాజకీయాలలో దుమారం రేపుతున్నాయి. పవన్ కళ్యాణ్ విలువ రోజురోజుకు దిగజారు పోతోందని, ఏ నాయకుడు చేయని విధంగా పవన్ కళ్యాణ్ 9 పార్టీలు మారాడన్నారు. చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ, సిపిఐ, బహుజన సమాజ్వాది పార్టీ అలాగే బిజెపి ఇంకా ఎన్నో పార్టీలో చేరడంతో పవన్ కళ్యాణ్ ఓట్ బ్యాంక్ నాశనమైపోయిందని ఆరోపణలు చేశారు. 2008 నుంచి పార్టీ పెట్టారే కానీ ఈ సొంత సీటులో గెలవలేదని పవన్ కళ్యాణ్ ను హేళన చేసినట్లు మాట్లాడారు. ఈ తరుణంలో వెంటనే పవన్ కళ్యాణ్ ను తమ పార్టీలో చేరాలని కేఏ పాల్ అనడం విశేషం. ఇక కేఏ పాల్ చేసిన వ్యాఖ్యలపై పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేఏ పాల్ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.