Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: గుజరాత్‌లో డిసెంబర్ 1, 5 తేదీల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల విషయం తెలిసిందే. క్రికెటర్ రవీంద్ర జడేజా భార్య రీవా జడేజా గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి. బీజేపీ అభ్యర్థిగా ఆమె పోటీ పడే ఛాన్సు ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై తుది నిర్ణయం ఇవాళ వెలుబడే అవకాశాలు ఉన్నాయి. గుజరాత్‌లో 27 ఏళ్ల నుంచి బీజేపీ పాలన కొనసాగుతున్న విషయం తెలిసిందే. రీవా జడేజా మెకానికల్ ఇంజినీరింగ్ చదివారు. కాంగ్రెస్ మాజీ నేత హరి సింగ్ సోలంకి బంధువు ఆమె. ఈసారి ఎన్నికల్లో హార్దిక్ పటేల్, అల్పేశ్ థాకూర్‌లు కూడా బీజేపీ నుంచి పోటీపడే ఛాన్సు ఉన్నట్లు తెలుస్తుంది.