Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న టీ20 వరల్డ్ కప్ మెగా టోర్నీలో భాగంగా బుధవారం తొలి సెమీ ఫైనల్ మ్యాచ్ న్యూజిలాండ్, పాకిస్థాన్ ల మధ్య జరుగుతోంది. ఇక గురువారం రెండో సెమీ ఫైనల్లో ఇంగ్లాండ్ జట్టుతో టీమిండియా తలపడనుంది. ఈ రెండు మ్యచ్ లలో విజయం సాధించే జట్ల మధ్య టీ20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఈ తరుణంలో ప్రత్యర్థి జట్టు బౌలర్లను హడలెత్తిస్తున్న టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీకి ఇంగ్లాండ్ జట్టు మాజీ సారథి కెవిన్ పీటర్సన్ ఓ ఆసక్తికర సలహా ఇచ్చాడు. తన దేశ జట్టుతో జరిగే మ్యాచ్ ఆడకుండా రెస్ట్ తీసుకోవాలంటూ కెవిన్ సరదా సలహా ఇచ్చాడు. సెమీ ఫైనల్ సన్నాహాల్లో భాగంగా బుధవారం నెట్ ప్రాక్టీస్ చేస్తున్న తన వీడియోను కోహ్లీ ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేయడంతో రేపటి సెమీస్ లో ఆంగ్లేయులకు పట్ట పగలే చుక్కలు కనిపించడం ఖాయమేనన్న వాదన ప్రచారంలో ఉంది. ఈ వీడియోను చూసిన కెవిన్ కోహ్లీని ఉద్దేశించి సరదా వ్యాఖ్యలు చేశాడు. గురువారం డే ఆఫ్ తీసుకోవచ్చు కదా నువ్వంటే నాకు ఎంత ఇష్టమో నీకు కూడా తెలుసు కానీ రేపు ఒక్క రోజు విశ్రాంతి తీసుకో ప్లీజ్ అంటూ కోహ్లీకి కెవిన్ సలహయిచ్చాడు. కోహ్లీ ఆడకుంటే తన దేశ జట్టు సెమీస్ గెలిచి ఫైనల్ చేరుతుందన్న భావన వచ్చేలా కెవిన్ ఈ సరదా సూచన చేశాడు. ఇది స్నేహ పూర్వకంగానే కోహ్లీకి కెవిన్ సరదా సలహా ఇచ్చాడని తెలుస్తుంది.