Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : దాయాదీ జట్టు పాకిస్థాన్ ఫైనల్‌కు చేరుకుంది. ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న టీ20 వరల్డ్‌కప్ తొలి సెమీస్‌లో భాగంగా కివీస్‌పై ఉత్కంఠ విజయం సాధించింది. కివీస్ నిర్దేశించిన 153 పరుగుల లక్ష్యాన్ని 7 వికెట్ల తేడాతో చేధించింది. 13 ఏళ్ల తర్వాత పాకిస్థాన్ తొలిసారిగా ఫైనల్‌కు చేరుకుంది.
తొలుత గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్ ఆరంభంలో దూకుడు ప్రదర్శించింది. ఐదు ఓవర్లలోనే ౩౦ పరుగులు చేసింది. డారిల్ మిచెల్ (53) హాఫ్ సెంచరీతో అదరగొట్టాడు. కేన్ విలియమ్సన్ (46) రాణించాడు. ఫిన్ అలెన్ (4) పరుగుల వేటలో విఫలమయ్యాడు. డేవిన్ కాన్వే (21), జేమ్స్ నీషమ్ (16) ఫర్వాలేదనిపించాడు. ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లు ముగిసేసరికి నాలుగు వికెట్ల నష్టానికి కివీస్ 152 పరుగులు చేసింది. న్యూజిలాండ్ నిర్దేశించిన 153 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్థాన్ బ్యాటర్లు చెలరేగి ఆడారు. బాబర్ ఆజామ్ (53), మహమ్మద్ రిజ్వాన్ (57) చెరో హాఫ్ సెంచరీతో కీలక ఇన్నింగ్స్ ఆడారు. 12 ఓవర్లు ముగిసేలోపు ఒక్క వికెట్ కూడా నష్టపోకుండా 102 పరుగులు చేశారు. 12.4 ఓవర్‌లో బాబర్ ఆజామ్ అవుటై పెవిలియన్ చేరడంతో క్రీజులోకి వచ్చిన మహమ్మద్ హారిస్ (30) కూడా ఫర్వాలేదనిపించాడు. చివరి క్షణాల్లో హారిస్ ఔటవ్వడంతో మ్యాచ్ ఉత్కంఠగా మారింది. కానీ క్రీజులో ఉన్న షాన్ మసూద్, అహ్మద్‌లు ఫర్వాలేదనిపించడంతో 5 బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని పాక్ చేధించింది. తొలి సెమీస్‌లో గెలవడంతో పాకిస్థాన్ ఫైనల్‌కు చేరుకుంది. రెండో సెమీస్‌లో భాగంగా గురువారం ఇంగ్లండ్‌తో టీమిండియా తలపడనుంది. వీరిలో గెలిచిన జట్టుతో ఆదివారం ఫైనల్‌లో పాకిస్థాన్ తలపడనుంది.