Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ లో పలు ఖాళీలు ఉన్నాయి. ఆసక్తి, అర్హత వున్నవాళ్లు ఈ పోస్టులకి అప్లై చూసుకోవచ్చు. మొత్తం 25 స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులు ఖాళీలుగా ఉన్నాయి. ఐటీ ప్రొఫెషనల్ (ఎంఎంజీ స్కేల్-2) లో ఈ పోస్టులని భర్తీ చేస్తున్నారు. బిజినెస్ అనలిస్ట్, డేటా ఇంజినీర్, క్లౌడ్ ఇంజినీర్, డేటా సైంటిస్ట్, నెట్‌వర్క్ సెక్యూరిటీ ఇంజినీర్, ఒరాకిల్ డీబీఏ, మిడిల్‌వేర్ ఇంజినీర్, సర్వర్ అడ్మినిస్ట్రేటర్, రూటింగ్ అండ్ స్విచింగ్ ఇంజినీర్, ఏటీఎం మేనేజ్డ్ సర్వీసెస్ ఏటీఎం స్విఉదోచ్, మర్చంట్ అక్విజిషన్ వంటి విభాగాల్లో ఈ ఖాళీలు వున్నాయి.
అర్హులు: గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్‌స్టిట్యూట్ నుండి బీఈ/బీటెక్/ఎంఈ/ఎంటెక్/ఎంఎస్సీ/ఎంబీఏ/ఎంసీఏ/పీజీ డిప్లొమా చేసిన వాళ్ళు ఈ పోస్టులకి అప్లై చెయ్యచ్చు.
వయస్సు: 25 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. ఆన్ లైన్ లో ఈ పోస్టులకి అప్లై చేసుకోవాల్సి వుంది.
ఈ పోస్టులకి అప్లై చేయాలంటే నవంబర్ 30, 2022వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవచ్చు. రూ.48,170ల నుంచి రూ.69,810ల వరకు సాలరీ ఉంటుంది. జనరల్ అభ్యర్ధులు రూ.500లు, రూ.100 ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ అభ్యర్ధులు రిజిస్ట్రేషన్ ఫీజు కట్టాల్సి వుంది. పూర్తి వివరాలను https://www.iob.in/1Careers1 లో చూడచ్చు.