Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : రోడ్డు దాటుతున్న ఓ కోతి అనుకోకుండా ఓ బైక్ చక్రంలో ఇరుక్కుపోయింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని బారబంకిలో చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వివరాల్లోకి వెళితే బారబంకి ప్రాంతంలోని రహదారిపై ఓ కోతి రోడ్డు దాటుతోంది. అదే సమయంలో ఓ వ్యక్తి ద్విచక్రవాహనంలో అటువైపుగా వేగంగా వెళ్తున్నాడు.. రోడ్డు దాటుతున్న వానరాన్ని చూసి సడెన్ బ్రేక్ వేశాడు. ఈ క్రమంలో కోతి అనుకోకుండా బైక్ ముందు చక్రంలో ఇరుక్కుపోయింది. దీంతో సదరు వ్యక్తి స్థానికుల సాయంతో కొన్ని గంటలు శ్రమించి ఆ కోతిని సురక్షితంగా బయటకు తీశారు. కోతి బైక్ ముందు చక్రంలో ఇరుక్కుని ఉన్న ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి.