Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం ముంజంపల్లి గ్రామ శివారులో గల జాలగుట్ట వద్ద గుర్తు తెలియని మహిళ మృతదేహం లభ్యమైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జాలగుట్ట సమీపంలోని వ్యవసాయ భూమిలో మహిళ మృదహాన్ని గుర్తించిన భూమి యజమాని శ్రీనివాస్ రెడ్డి పోలీసులకు సమాచారం అందించాడు. సమాచారం అందుకున్న సీఐ మాదాసు రాజకుమార్, ఎస్సై తిరుపతి, సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. గత ఐదు రోజుల క్రితం మృతి చెంది ఉంటుందని పోలీసులు తెలిపారు. మృతదేహం కుళ్లిపోయి ఉండడంతో గుర్తుపట్టలేని స్థితిలో ఉందన్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ మాధవ రాజ్ కుమార్ తెలిపారు.