Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : ఎంబీబీఎస్, బీడీఎస్ సీట్ల భర్తీకి వెబ్ కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు కాళోజీ హెల్త్ యూనివర్సిటీ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. గురువారం విడుదల చేసిన నోటిఫికేషన్ ఆధారంగా ప్రైవేట్ కళాశాలల్లో ఎంబీబీఎస్, బీడీఎస్ యాజమాన్య కోటా సీట్ల భర్తీ చేయనున్నట్లు చెప్పారు. అర్హతలు కలిగిన అభ్యర్థులు నవంబర్ 11వ తేదీ ఉదయం 6 నుంచి 12వ తేదీ సాయంత్రం 4 గంటల వరకు కళాశాలల వారీగా వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవాలని సూచించారు. కళాశాలల వారీగా సీట్ల వివరాలను వెబ్‌సైట్‌లో పొందుపరిచామని తెలిపారు. పూర్తి వివరాలకు యూనివర్సిటీ వెబ్‌సైట్ https://www.knruhs.telangana.gov.in/ ను సందర్శించొచ్చు.