Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : హైదరాబాద్ నగరంలోని ఆసిఫ్ నగర్ పోలీసు స్టేషన్ పరిధిలో గురువారం రాత్రి భారీ అగ్నిప్రమాదం సంభవించింది. గుడిమల్కాపూర్ పూల మార్కెట్ పక్కనే ఉన్న ఓ అపార్ట్‌మెంట్ సెల్లార్‌లో మంటలు చెలరేగాయి. షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్నికీలలు ఎగిసిపడ్డాయి. అప్రమత్తమైన అపార్ట్‌మెంట్ వాసులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసింది. సెల్లార్‌లో పార్కింగ్ చేసిన మూడు బైక్‌లు పూర్తిగా కాలిపోయాయి. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో అపార్ట్‌మెంట్ వాసులు, స్థానికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.