Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : హైదరాబాద్‌లోని జగద్గిరిగుట్టలో దారుణం జరిగింది. రాజీవ్ గాంధీ నగర్ కాలనీలో ఓ వ్యక్తి తన భార్యను హత్య చేసి, అనంతరం తానూ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళ్తే.. బీ రాజు(35), బీ కవిత(33) అనే ఇద్దరు దంపతులు రాజీవ్ గాంధీ నగర్‌లో నివాసముంటున్నారు. అయితే వీరిద్దరి మధ్య చిన్న చిన్న గొడవలు జరిగేవి. గురువారం ఉదయం కూడా దంపతుల మధ్య స్వల్ప ఘర్షణ చోటు చేసుకుంది. సహనం కోల్పోయిన భర్త ఆవేశంతో ఊగిపోయాడు. కత్తితో ఆమె గొంతును కోసేశాడు. ఆమె ప్రాణాలు కోల్పోయిందని నిర్ధారించుకున్న తర్వాత.. రాజు వేరే గదిలోకి వెళ్లి ఉరేసుకున్నాడు. స్థానికులు అందించిన సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. చిన్న చిన్న విషయాలకే రాజు గొడవపడేవాడని కవిత కుటుంబ సభ్యులు తెలిపారు.