Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : జమ్ముకశ్మీర్‌లోని షోపియాన్‌లో ఉగ్రవాదులు, భద్రతా దళాలకు మధ్య ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో ఓ ముష్కరుడు హతమయ్యాడు. శుక్రవారం ఉదయం షోపియాన్‌లోని కప్రేన్ ప్రాంతంలో భద్రతా బలగాలు, స్థానిక పోలీసులు సంయుక్తంగా గాలింపు చేపట్టారు. ఈ క్రమంలో టెర్రరిస్టులు, భద్రతా దళాలకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో జైషే మహమ్మద్ ఉగ్రసంస్థకు చెందిన ఉగ్రవాది చనిపోయాడని కశ్మీర్ ఏడీజీపీ తెలిపారు. ఆ ప్రాంతంలో ఇంకా ఆపరేషన్ కొనసాగుతున్నదని చెప్పారు.