Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను టీటీడీ నేడు విడుదల చేయనుంది. డిసెంబర్ నెల కోటాకు సంబంధించిన రూ.300 శ్రీవారి ప్రత్యేక దర్శన టోకెన్లను శుక్రవారం ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌లో విడుల చేయనున్నది. డిసెంబర్ మాసం మొత్తానికి సంబంధించిన టికెట్లు అందుబాటులో ఉంచనున్నది. కరోనా మహమ్మారి తరువాత తిరుమలలో పూర్తిగా నిబంధనలు ఎత్తివేయడంతో కొన్ని నెలలుగా భక్తులు పెద్ద ఎత్తున తిరుమలను సందర్శిస్తున్నారు. కాగా, వీఐపీ బ్రేక్ దర్శన వేళల్లో మార్పుల కారణంగా డిసెంబర్ నెల కోటా టికెట్ల విడుదల ఆలస్యమైందని అధికారులు తెలిపారు.