Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : అపార్ట్‌మెంట్ ఎదుట క్యాబ్ కోసం ఎదురుచూస్తున్న మహిళ మెడలోని మంగళసూత్రాన్ని ఓ ఆగంతుకుడు లాక్కెళ్లాడు. ఈ సంఘటన పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఎర్రమంజిల్ హిల్‌టాప్ కాలనీ శ్రీనిలయ అపార్ట్‌మెంట్‌కు చెందిన నీరజ అమీర్‌పేటకు వెళ్లేందుకు గురువారం మధ్యాహ్నం క్యాబ్ బుక్ చేసింది. అత్త వర్ణ కుమారి, మరదలు సంధ్యలతో కలిసి అపార్ట్‌మెంట్ ఎదుట క్యాబ్‌కోసం ఎదురుచూస్తూ నిలుచున్నారు. బ్లూ కలర్ పల్సర్ బైక్‌పై హెల్మెట్ పెట్టుకుని వచ్చిన ఓ ఆగంతుకుడు నీరజ మెడలో నుంచి మూడు తులాల బంగారు మంగళసూత్రాన్ని తెంపుకుని పారిపోయాడు. దీంతో ఆమె మెడకు గాయమైంది. అడ్డుకోబోయిన సంధ్యను పక్కకు తోశాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పంజాగుట్ట పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.