Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : తెలంగాణకు మరో భారీ కంపెనీ రానుంది. దేశంలోనే అతిపెద్ద ఐస్ క్రీమ్ కంపెనీ జహీరాబాద్ లో ప్రారంభమైందని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్ గురువారం ట్విటర్ ద్వారా తెలిపారు.
రోజుకు 7 టన్నుల చాక్లెట్లు, 100 టన్నుల ఐస్ క్రీమ్ ను ఉత్పత్తి చేసే పరిశ్రమను రూ. 600 కోట్లతో హాట్సన్ సంస్థ ఏర్పాటు చేయడం సంతోషాన్నిచ్చిందని పేర్కొన్నారు. నిప్రసిద్ధి చెందిన అరుణ్, ఐబాకో ఐస్ క్రీములు ఇక్కడ ఉత్పత్తి అవుతున్నాయి. దీని ద్వారా భారత్ లో ఐస్ క్రీమ్ ల తయారి కేంద్రంగా జహీరాబాద్ మారింది. రాష్ట్రంలో శ్వేత విప్లవానికి ఇది నిదర్శనం అని కేటీఆర్ తెలిపారు. హాట్సన్ ఐస్ క్రీమ్ పరిశ్రమ ఫోటోలను ట్వీట్ కు జత చేశారు.