Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర మహారాష్ట్రలో కొనసాగుతోంది. నాందేడ్ జిల్లాలోని అర్ధాపూర్ నుంచి ఇవాళ యాత్ర పున:ప్రారంభమైంది. మరోవైపు గురువారం నాందేడ్ జిల్లాలోని కాష్టి చౌక్ వరకు యాత్ర సాగింది. ఈ యాత్రలో వేలాది మంది కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు. భారత్ జోడో యాత్రలో ఇవాళ శివసేన మాజీ మంత్రి ఆదిత్యా ఠాక్రే పాల్గొననున్నారు. ఎన్సీపీ అధినేత శరద్ పవార్ జోడో యాత్రలో పాల్గొనాల్సి ఉండగా... ఆకస్మిక అనారోగ్యం కారణంగా.. పవార్ ఆస్పత్రిలో చేరారని.. అందుకే హాజరు కావడం లేదని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జైరాం రమేశ్ స్పష్టం చేశారు.