Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: ఢిల్లీకి మరోసారి తెలంగాణ సీఎం కేసీఆర్ పయనం కానున్నారని ప్రచారం జరుగుతుంది. రేపు రామగుండం కు ప్రధాని నరేంద్ర మోడీ రానున్న నేపథ్యంలో ఇవాళ రాత్రే ఢిల్లీకి మరోసారి తెలంగాణ సీఎం కేసీఆర్ పయనం కానున్నారని సమాచారం తెలుస్తుంది. అయితే ఇవాళ ఢిల్లికి వెళ్లనున్న సీఎం కేసీఆర్ దాదాపు నాలుగు రోజుల పాటు ఢిల్లీలో పలువురు నేతలను కలువనున్నారని వినిపిస్తోంది. అంతేకాదు ఢిల్లీ నుండి హైదరాబాద్ కు రోడ్డు మార్గానే తిరుగు ప్రయాణం కావాలని నిర్ణయం తీసుకున్నారట. పలు రాష్ట్రాల్లో రోడ్ షోలు, స్థానిక నేతలతో సమావేశాలు నిర్వహించేందుకు సిద్ధం అవుతున్నారని కూడ తెలుస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన రాలేదు కానీ టీఆర్‌ఎస్ పార్టీ సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. తదుపరి విషయాలు తెలువాల్సి ఉంది.