Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: టీ20 వరల్డ్ కప్ సెమీస్ లో ఇంగ్లాండ్ చేతిలో ఓటమి పాలై, తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న భారత జట్టుకు లెజండరీ క్రికెటర్ సచిన్ టెండుల్కర్ బాసటగా నిలిచాడు. గెలుపు ఓటములు సహజమేనన్న రీతిలో అభిప్రాయాన్ని వ్యక్త పరిచాడు. నాణేనికి రెండు ముఖాలు ఉంటాయని, మన జట్టు విజయాన్ని మనదిగా జరుపుకుంటున్నప్పుడు మన జట్టు ఓటములను కూడా అదే మాదిరి తీసుకోవాలన్నారు. జీవితంలో ఈ రెండూ ఒకదానితో ఒకటి కలసే ఉంటాయని సచిన్ టెండుల్కర్ తన ట్వీట్ ద్వారా తెలిపాడు. ఈ తరుణంలో సచిన్ టెండుల్కర్ చేసిన ట్వీట్ అభిమానులను ఆలోచింపజేసి, శాంతింపజేస్తుందేమో చూడాలి.