Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముంబై: మహారాష్ట్రలోని నాంధేడ్‌లో భారత్ జోడో యాత్ర సందర్భంగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ మీ జీవితంలో ఏ విషయానికైనా భయపడటం మానుకోవాలని, భయాన్ని హృదయాల నుంచి పారదోలి దేశం కోసం పనిచేయాలని యువతను కోరారు. దేశంలో విభజన బీజాలు నాటే విద్వేషాన్ని వ్యాప్తి చేయకుండా ప్రేమ, సోదరభావాన్ని పెంపొందించేలా యువత చొరవ చూపాలని పిలుపునిచ్చారు. మహారాష్ట్రలో ఐదో రోజు తన పాదయాత్రను కొనసాగించిన రాహుల్ గాంధీ రాష్ట్రంలో ఐదు జిల్లాల్లోని 15 అసెంబ్లీ నియోజకవర్గాలు, 6 పార్లమెంట్ నియోజకవర్గాల మీదుగా 382 కిలోమీటర్లు నడుస్తారు. ఈనెల 20న రాహుల్ మహారాష్ట్ర నుంచి మధ్యప్రదేశ్‌లోకి అడుగుపెడతారు. ఇక కాంగ్రెస్ నేత పాదయాత్రలో హింగోలి జిల్లాలో శివసేన నేత ఆదిత్యా ఠాక్రే శుక్రవారం సాయంత్రం రాహుల్ గాంధీతో కలిసి నడవనున్నారు.