Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: మోడీ పర్యటలో సీఎం కేసీఆర్ కు ఆహ్వానం అందలేదని బాల్క సుమన్ మండిపడ్డారు. భారత్ బయోటెక్ వచ్చినప్పుడు క్రెడిట్ కోసం ప్రధాని ఒక్కరే వెళ్లారని పీఎంవో నుంచి సీఎంఓ కు గెస్ట్ ఆప్ ఆనర్ గా పిలవడం ఆనవాయితీ అని గుర్తు చేశారు. ఇది తెలంగాణ సమాజం నాలుగు కోట్ల జనాల్ని అవమానించడమేనని, తెలంగాణ వైఖరిని ప్రశ్నిస్తున్న తీరు బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. సింగరేణి ని ప్రైవేటు పరం చేయమన్న దానిపై మోడీ స్పందించాలన్నారు. కార్మికులకు పెన్షన్ పెంచుతామన్నారు ఆ ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. 11వ వేతన ఒప్పందం అమలు, సిసిఐని ఆదిలాబాద్ జిల్లాలో పునర్ ప్రారంభ విషయాలు తెలుపాలన్నారు. 14 నెల్ల కిందట ప్రారంభం అయిన ఎరువుల కర్మాగారం ఇప్పుడు మళ్లీ ప్రారంభించడం ప్రధాని డ్రామా అన్నారు. తెలంగాణకు 10 మెడికల్ కాలేజీలు ఇస్తామని ప్రకటించాలని డిమాండ్ చేశారు.